సీరియల్ బ్యాచ్ కి వార్నింగ్.. యావర్ పై నాగార్జున ఫైర్!
on Sep 18, 2023
బిగ్ బాస్ సీజన్-7 ఆసక్తికరంగా సాగుతుంది. కాగా ఒక్కో వారం ఒక్కో కొత్త కంటెంట్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. కాగా ఈ సీజన్ లో కొత్త కంటెస్టెంట్ ఇచ్చే స్టఫ్ తో ఈ షో టీఆర్పీ అత్యధికంగా ఉంది. అయితే సోమవారం జరిగే నామినేషన్లు, శని ఆదివారాలలో నాగార్జున ఎపిసోడ్‌ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. పాలిటిక్స్ తరాహాలో నామినేషన్లు సాగుతున్నాయి.
బిగ్ బాస్ సీజన్-7 లో స్టార్ మా టీవీ సీరియల్స్ నటించిన ప్రియాంక జైన్, అమర్ దీప్, శోభా శెట్టి అంతా కలిసి ఒక బ్యాచ్ గా కూర్చోవడం, మాట్లాడుకోవడం కావాలని మిగిలిన కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేయడం చేస్తున్నారు. గతవారం జరిగిన నామినేషన్లో ఈ ముగ్గురు కావాలని పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశారు. ఇదే విషయం నాగార్జున కూడా అన్నాడు. అయితే అమర్ దీప్ నామినేషన్ల ముందు.. 'అందరం కలిసి నామినేట్ చేద్దాం, ఏం చేస్తాడో చూద్దాం' అంటూ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడిన మాటలన్నీ బయటకొచ్చాయి. ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారింది. కావాలని టార్గెట్ చేసి ఈ సీరియల్ బ్యాచ్ చేసే పనులకి నాగార్జున గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.
అయితే ఈ సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ గా ఆట సందీప్ ఉన్నాడు. ఇతనికి పవరస్త్ర ఉంది కాబట్టి సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఇక మొన్న జరిగిన టాస్క్ లో అమర్ దీప్ ని ఎందుకు సెలెక్ట్ చేశావని ఆట సందీప్ ని నాగార్జున అడుగగానే ఆట సందీప్ తడబడుతూ మాట్లాడాడు. దాంతో వాళ్ళు కావాలనే ఒక్కటై ఆడుతున్నారని అందరికి తెలిసిపోయింది. ఇక టేస్టీ తేజ ఎవరివైపు వెళ్ళకుండా తటస్థంగా ఉన్నాడు. రతిక కంటెంట్ కోసం చాలా కష్టపడుతుంది. కానీ పెద్దగా వర్కవుట్ అవడం లేదు. ఎందుకంటే అందరికి తను రతిక కాదు రాధిక అని అర్థమైంది. అయితే సండే ఎపిసోడ్‌లో ఎవరు బల్లాలదేవ, ఎవరు కట్టప్ప అంటూ ఒక్కో కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకోమని నాగార్జున చెప్పగా.. ఒక్కొక్కరు వచ్చి వారికి ఎవరెలా అనిపించారో చెప్పారు. అయితే షకీల యావర్ ని బల్లాల దేవ అని, టేస్టీ తేజని కట్టప్ప అని వ్యాలిడ్ రీజన్ చెప్పింది. యావర్ ఒక్కడి వల్లే రణధీర టీమ్ గెలిచిందని ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మేమేం చేయలేదంట అని షకీల మాట్లాడుతుంటే .. యావర్ మద్యలో కలుగజేసుకొన్నాడు. నాగార్జున మాట్లాడుతున్న సరే యావర్ పట్టించుకోకుండా మాట్లాడుతునే ఉన్నాడు. దాంతో "ఆగు యావర్.. మాట్లాడుతున్నాను కదా " అంటూ గట్టిగా ఫైర్ అయ్యాడు నాగార్జున.
Also Read